Header Banner

ఒమాన్ కంపెనీ చేతిలో మోసపోయిన 9 మంది! ఎన్నారై టిడిపి చొరవతో ఒమాన్ నుండి ఆంధ్ర కు సురక్షితంగా! కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో!

  Sat May 10, 2025 15:01        Helping Hand, Oman

ఒమన్ నుండి సురక్షితంగా ఇంటికి చేరుకున్న 9 మంది శ్రీకాకుళం యువకులు

2025 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం నుండి పని కోసం ఒమన్‌కు వచ్చిన తొమ్మిది మంది యువకులు, కంపెనీ హామీ ఇచ్చిన ఉద్యోగం తమకు లభించకపోవడంతో నిరాశ చెందారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా, కంపెనీ వారిని పోర్టులోని మరొక విభాగంలో పనిచేయమని కోరింది. 

 

వారిలో ఎక్కువ మంది యువకులు వెల్డింగ్ నిపుణులు, క్లీనింగ్ విభాగంలో పనిచేయడానికి ఇష్టపడలేదు. భారతదేశానికి తిరిగి రావాలనుకుంటున్నట్లు కంపెనీ అధికారులకు చెప్పారు. దేశానికి తిరిగి రావడంలో వారు సమస్యలను ఎదుర్కొన్నందున, వారు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్నారై టీడీపీ సెల్ ను సంప్రదించగా ఎన్నారై టీడీపీ సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ గారు కేంద్ర పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు మరియు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారు వెంటనే స్పందించి, మస్కట్ లోని భారత రాయబార కార్యాలయానికి లేఖ రాశారు మరియు వారు తగిన చర్యలు తీసుకొనేలా ప్రయత్నాలు చేశారు. 

 

ఎన్నారై టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజశేఖర్ జోక్యంతో, ఈ విషయాన్ని ఎన్నారై టీడీపీ సభ్యులు మస్కట్ లో మీడియాలో పనిచేస్తున్న మడకశిర రాజేష్, రెడ్రౌతు శ్రీనివాసరావు మరియు సోషల్ వర్కర్ నాగరాజు దృష్టికి తీసుకువెళ్ళి, ఆ 9 మంది కార్మికులను ఒమన్ రాజధాని నగరం మస్కట్‌లోని ఒక ఫ్లాట్‌లో ఉంచారు. ఈ ముగ్గురు ఎన్నారై టీడీపీ సెల్ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అధికారులతో పాటు వారిని ఒమాన్ పంపించిన ఏజెంట్ తో సమన్వయం చేసుకుని, యువకులను స్వదేశానికి పంపించడానికి ఒమన్ కంపెనీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ విషయంలో ఏజెంట్ కూడా సానుకూలంగా స్పందించి వారి యొక్క పూర్తి సహకారాన్ని అందించడం జరిగింది. చివరికి మే 5న ఆ కంపెనీ అధికారులతో జరిపిన చర్చలు ఫలించడంతో శ్రీకాకుళం నుండి వచ్చిన 9 మంది యువకులు భారతదేశానికి తిరిగి వచ్చారు. 

 

ఇది కూడా చదవండి: కేంద్రం కీలక నిర్ణయం! అప్పటివరకు ఇక విమానాలు రద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

కాగా, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ ప్రయాణంలో వారికి అవసరమైన అన్ని సహాయాలను అనగా ముంబై ఎయిర్పోర్ట్ నుండి రైల్వే స్టేషన్ వరక్కు, మరియు రైల్వే స్టేషన్ నుండి వారి స్వస్థలానికి చేరుకోవడానికి దారి ఖర్చులు అందించారు. ఎన్ఆర్ఐ టిడిపి ఒమన్ సభ్యులు కూడా వీరికి తగిన ఆర్ధిక సహాయం చేయడం జరిగింది. వీరందరూ మే 6న వారి స్వస్థలానికి చేరుకుని ఈ సందర్భంగా వారికి సహాయం చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసారు. 

 

అదేవిధంగా ఈ 9 మందిని భారత్ కు తీసుకురావడానికి కృషి చేసిన ఎన్నారై టీడీపీ ఒమాన్ సభ్యులను ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు, ఎన్నారై టీడీపీ సెల్ ప్రెసిడెంట్ డా. రవి వేమూరు గారు, కో ఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ గారు వీరి కృషిని అభినందించారు. అలాగే సమస్యకు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకొని ఖర్చులకు డబ్బు ఇచ్చి వారు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకునేలా చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియచేసారు.

Oman NRI TDP.jpeg 

Srikakulam members rescue.jpeg

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Oman #NRITDP #Indian #CentralMinister #Srikakulam